హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తన ఇంటిని కూల్చొద్దని కాంగ్రెస్ నాయకుడు, సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై ఈ మేరకు దరఖాస్తు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటికి మార్కింగ్ చేశారని తెలిపారు. ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమి సేకరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో స్వయంగా కాంగ్రెస్ నేతే ప్రజాభవన్‌కు వచ్చి ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.