హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమ స్తే తెలంగాణ): అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన పదెకరాల స్థలాన్ని జేఎన్ఎఫ్ఏయూకు కేటాయించడాన్ని వెనక్కి తీసుకోవాలని వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. వారు సోమవారం వర్సిటీలో సమావేశమై మాట్లాడుతూ.. తకువ ఫీజులతో ఉన్నత విద్యనందిస్తున్న విశ్వవిద్యాలయ భూమిని వేరే విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని ఖండించారు. సమావేశంలో వర్సిటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బానోత్ ధర్మ, అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, సెక్రటరీ ఉదయిని పాల్గొన్నారు.