హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)ః తిరుమల శ్రీవారికి మంతెన రామలింగరాజు మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఈ మేరకు స్వామివారికి రామలింగరాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణకు రూ.9 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే భారీ విరాళాన్ని అందజేసిన మంతెన రామలింగరాజుకు టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్నాయుడు అభినందనలు తెలిపారు.