కృష్ణానదిలో సహజసిద్ధంగా డాల్ఫిన్ నోస్ ఆకారంలో ఉన్న గుట్టను ‘నమస్తే తెలంగాణ’ గుర్తించింది. కాస్త సాహసోపేతమైనప్పటికీ.. కొల్లాపూర్ రూరల్, పెంట్లవెల్లి ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్లు.. కృష్ణానదిలో 7 కిలోమీటర్లు బోటులో ప్రయాణించి ఈ డాల్ఫిన్ నోస్ ఆకారంలో ఉన్న గుట్ట చిత్రాన్ని తీశారు. మీరు చూస్తున్న చిత్రం అదే. కొల్లాపూర్‌కు సుమారు 10 కిలోమీటర్లు దూరంలోని అమరగిరి నుంచి బోటులో సుమారు 7 కిలోమీటర్లు దూరం కృష్ణానదిలోనే ప్రయాణిస్తే.. చీమలతిప్ప వస్తుంది. అక్కడి నుంచి అంకాలమ్మదేవి ఆలయం ఉన్న గుట్టను చూస్తే.. అచ్చంగా.. డాల్ఫిన్ నోస్లాగా కనపడుతుండటం మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తున్నది.
ఫోటో : సీపీ నాయుడు, హకింకారి రమణాజిరావు: కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి