లింగాలఘనపురం, నవంబర్ 13 : స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని బీజేపీ అభ్యర్థి విజయరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆయన జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, వడిచర్లలో మీడియా సమావేశాలకే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘2004లో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి పదవి చేపట్టా. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా.
మల్కాజిగిరి స్థానాన్ని కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరా. బీజేపీ పట్టించుకోకుండా బలవంతం గా స్టేషన్‌ఘన్‌పూర్ కేటాయించింది. ఇష్టం లేకపోయినా బరిలో ఉన్నా’ అని ప్రకటించారు. వంట చేసే వాడే ముక్కు మూసుకుని మురిగిన కూరగాయలతో వండుతుంటే.. తినేవారి పరిస్థితి ఏమిటంటూ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.