హైదరాబాద్ : ఆసుప్రతి సిబ్బందిపై మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విధులు బహిష్కరించారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో గర్భంలోనే ఆడశిశువు మృతి చెందింది. పంతుపల్లికి చెందిన ఓ గర్భిణి ప్రసవానికి వచ్చింది. కాన్పు చేసే సమయంలో గర్భంలోనే శిశువు మృతి మరణించింది. దీనికి వైద్యులు నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. అలాగే నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిపై ఆందోళనకారులు దాడి దిగారు. ఈ క్రమంలో వైద్యులు వైద్యులు బహిష్కరించారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని, వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. ఆసుప్రతిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.