నాగర్కర్నూల్, మే 22 : ఒత్తిడికిలోనై ఓ వైద్యుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. నాగర్కర్నూల్ జనరల్ దవాఖానలో ఓ పక్క వసతులు లేకపోవడం, రోగుల సంఖ్య పెరగడం, మరోపక్క ఉన్నతాధికారి వేధింపులు, అవమానాలు భరించలేక ఎముకల వైద్యుడు అఖిల్ విధుల నుంచి తప్పుకున్నాడు.
గరువారం జిల్లా సూపరింటెండెంట్ రచ్చ రఘుకు రాజీనామా లేఖ అందించాడు. ఈ ఘటనతో జిల్లా దవాఖాన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తోటి వైద్యులు సైతం ఇదేబాట పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.