KV Ramanachary | తెలుగు యూనివర్సిటీ, మార్చి 5 : తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారికి బేగంపేటలోని కిమ్స్-సన్షైన్ దవఖానలో బుధవారం మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. గత కొంత కాలంగా మోకాలి నొప్పితో భాధపడుతున్న రమణాచారికి ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ గురువారెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. రమణాచారికి మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలిపారు.
గత రెండు సంవత్సరాల క్రితం ఒక కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. మళ్లీ ఆయనకు మరో కాలికి శస్త్ర చికిత్స అవసరం పడడంతో తప్పని పరిస్థితిలో దానికి కూడా బుధవారం చికిత్స చేయించుకున్నారు. ఐఏసీయులో చికిత్స పొందుతున్న రమణాచారిని గురువారం ప్రత్యేక గదికి తరలించి మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం ఆరోగ్యం మెరుగుపడగానే డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. ఒక నెలరోజుల పాటు ఫిజియోథెరపి ప్రక్రియ ద్వారా ఆయన కోలుకుంటారని వైద్యులు తెలిపారు.