హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆడిట్‌ను పరిగణనలోకి తీసుకోకుం డా, ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వకుండా మోసంచేస్తూ ఫీజులు పెంచాలనే ప్రతిపాదనను ఆమోదించవద్దని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్(టీపీటీఎల్ఎఫ్) ప్రభుత్వా న్ని డిమాండ్ చేసింది. సోమవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డికి టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు కొమ్ము విజయ్ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు ఫ్యాకల్టీకి తకువ జీతాలిస్తూ ఎకు వ ఇస్తున్నట్టు లెకలు చూపుతున్నాయని ఆరోపించారు. ప్రశ్నించిన లెక్చరర్లను, ప్రొఫెసర్లను బెదిరించి అర్ధాంతరంగా తీసివేస్తున్నారని వా పోయారు. జేఎన్టీయూ, ఉస్మాని యా యూనివర్సిటీ ఆడిట్‌ను పరిగణనలోకి తీసుకొని ఫీజుల పెంపును పరిశీలించాలని డిమాండ్ చేశారు.