హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ హాజరుపై వైద్య కళాశాల అధ్యాపకులు ఆందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మే 1 నుంచి ముఖ హాజరు అమలు కానున్నట్టు చెప్పారు.
జాతీయ వైద్య కమిషన్ ఇటీవల సంబంధిత సర్క్యులర్ విడుదల చేసిందని తెలిపారు. యాప్ ద్వారా హాజరు ఇష్టం లేకుంటే కాలేజీల్లో ఏర్పాటు చేసే వాల్ మౌంట్ డివైజ్ల ద్వారా హాజరు వేసుకోవచ్చని తెలిపారు.