దిత్వా ఎఫెక్ట్.. పలు జిల్లాల్లో నేడు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను రాబోయే 24గంటల్లో బలహీనపడి వాయుగుండంగా మారునున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
- 24గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను రాబోయే 24గంటల్లో బలహీనపడి వాయుగుండంగా మారునున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తుఫాను బలహీనపడినా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ఈ తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరి తమిళనాడు తీరాల నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని తెలిపింది. రాగల 24గంటల్లో ఈ దిత్వా తుఫాను ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా కదిలే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఆదివారం రాత్రికి ఈ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరప్రాంతాల సమీపంలో 30నుంచి 60కి.మీ వేగంతో చేరుకునే అవకాశం ఉన్నదని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది. సోమవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. అలాగే రెండురోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇదిలా ఉండగా, దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో గత రెండురోజుల నుంచి చలి తీవ్రత మళ్లీ పెరిగింది. దీంతో పలు జిల్లాల్లో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలంలో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో 500 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
దిత్వా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, నెల్లూరు జిల్లాలపై పడింది. కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సము ద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అంతేకాకుండా 500 మీటర్లు సముద్రం ముం దుకు దూసుకొచ్చింది. దీంతో బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

