సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 18:48:41

టీఆర్‌ఎస్‌ నుంచి జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడి సస్పెండ్‌

టీఆర్‌ఎస్‌ నుంచి జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడి సస్పెండ్‌

కరీంనగర్ : గన్నేరువరం ఎంపీపీగా ఎన్నికైన హన్మాజిపల్లి ఎంపీటీసీ, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ యువ సేవా కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతిరెడ్డి మాట్లాడారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి కొద్ది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా వైఖరి మార్చుకోలేదన్నారు.

పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, జిల్లా ఆర్‌బీఎస్‌ కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బూర వెంకటేశ్వర్లు, యువజన విభాగం నియోజక వర్గం అధ్యక్షుడు గూడూరి సురేశ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ రఫీ, గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


logo