హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ కానుక’ కుట్టుమిషన్ల పంపిణీ పథకంలో సిక్కు మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ కోరారు. ఈ విషయమై ఆయన పలువురు సిక్కు ప్రతినిధులతో కలిసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్‌కు నాంపల్లిలోని హజ్ భవన్లో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల్లోనూ సిక్కులకు ప్రాధాన్యమివ్వాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.