నెలాఖరు వరకు రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేయాలి
మంత్రి జగదీష్ రెడ్డి | కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సూర్యాపేట : కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి ఆగస్టు నుంచి రేషన్ ను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా మంజూరు ఆయిన ఆహారభద్రత కార్డులను ఆయన బుధవారం రోజున సూర్యపేట నియోజకవర్గంలో మండలాల వారిగా పంపిణీ చేశారు.
ఆత్మకూరు ఎస్ 425, చివ్వేంల 436, సూర్యపేట పట్టణానికి సంబంధించిన 608 కార్డులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఉండే అభాగ్యులను గుర్తించి వారి బాధలను తెలుసుకుని పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.
రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత మనందరికంటే బహుబాగా తెలిసిన నేత సీఎం కేసీఆర్ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్రలో మంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడి ప్రజలను ప్రజలుగా..రైతులను రైతులుగా..సంస్కృతిని సంస్కృతిగా చివరి ఆఖరికి ఇక్కడి గ్రామ దేవతలను దేవతలుగా గుర్తించేందుకు వారికి మనస్కరించ లేదన్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో పదవులను తృణప్రాయంగా త్వజించి చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించిందే ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రవేశ పెట్టలేదో అన్నది ప్రజలు ఆలోచన చెయ్యాలని ఆయన కోరారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణా రాష్ట్రంలో సాధ్యం అవుతున్నప్పుడు లోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు మిగతా రాష్ట్రాలలో ఎందుకు అమలు జరగడం లేదు అన్నది ప్రజల్లో చర్చ జరగాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

