e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News తెలంగాణ యాస‌లో నాని వినోదం

తెలంగాణ యాస‌లో నాని వినోదం

న్యాచుర‌ల్ స్టార్ హీరో నాని ఇటీవ‌లే శ్యామ్ సింగ‌రాయ్ సినిమా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. శ్యామ్ సింగ‌రాయ్ ను కంప్లీట్ చేసి త‌న నెక్ట్స్ మూవీ అంటే సుంద‌రానికి సెట్స్ లో జాయిన్ కాబోతున్న‌ట్టు వీడియో ద్వారా తెలియజేశాడు. ఈ చిత్రం వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్ లో తెర‌కెక్క‌నుంది. అయితే కొన్ని రోజుల క్రితం శ్రీకాంత్ ఓదెల అనే కొత్త ద‌ర్శ‌కుడితో తెలంగాణ‌లో రూర‌ల్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో సినిమాకు సైన్ చేశాడు నాని.

ఈ ప్రాజెక్టులో తెలంగాణ స్టైల్ ను చూపించాల్సి ఉండ‌టంతో..నాని ప్ర‌స్తుతం దానిపైనే ఫోక‌స్ పెట్టాడ‌ట‌. తెలంగాణ యాస‌లో యాక్టింగ్ స్టైల్ ను సిల్వ‌ర్ స్క్రీన్ పై చూపించేందుకు నాని త‌న‌ను తాను మెరుగులు దిద్దుకునే ప‌నిలో ఉన్న‌ట్టు టాక్‌. ఇక ఈ ప్రాజెక్టు ద‌స‌రా త‌ర్వాత సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలున్న‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌.

- Advertisement -

మ‌రోవైపు నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ విడుద‌ల కావాల్సి ఉంది. గతేడాది లాక్ డౌన్ లో నాని నటించిన వీ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ‌గా ఆశించిన స్థాయి స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాల‌ని చూస్తున్నాడు నాని.

ఇవి కూడా చదవండి..

‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియ‌న్ మ్యాన్ ’ గా ప్ర‌భాస్

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వ‌చ్చాడు..‘తిమ్మ‌రుసు’ ట్రైల‌ర్

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement