మాగనూరు (కృష్ణ), అక్టోబర్ 8 : కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి, సర్కార్ బకాయిపడ్డ వివరాలపై ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులను పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రేవంత్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడ లేదని వి మర్శించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. హామీలు అమలుకాకపోతే తమను నిలదీయాలని రేవంత్ నాడే చెప్పారని గుర్తుచేశారు. ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.