హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ కలవేని నాగరాజును విధుల నుంచి తొలగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 14, 2011లో కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియలో భాగంగా ఆయన నకిలీ పీజీ సర్టిఫికెట్ దాఖలు చేసినట్టు తేలింది. దీంతో నిబంధనలు ప్రకారం ఆయన విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు సంబంధిత శాఖల హెచ్వోడీలకు ఆదేశాలు పంపారు.