హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు నుంచి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్కు విముక్తి లభించింది. 2009లో ఓయూ విద్యార్థి నేతలుగా ఉన్నప్పుడు సుమన్, రాజారాం యాదవ్ తదితరులు తెలంగాణ బంద్ సందర్భంగా ఓ పెట్రోల్ పంపు అద్దాలు పగులగొట్టిన ట్టు లాలాగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై నాంపల్లిలోని ఎంపీలు, ఎమ్మెల్యేల కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణకు సుమన్, రాజారాంయాదవ్ హాజరయ్యారు. వారి తరఫున లాయ ర్లు కిరణ్కుమార్, జక్కుల లక్ష్మణ్, శ్రీనాథ్, రాము వాదించారు. న్యా యమూర్తి జయకుమార్ కేసును కొట్టేసినట్టు లక్ష్మణ్ వెల్లడించారు.