తెలంగాణ వాణిజ్య పన్నుల తీరు ఆదర్శం
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉన్నదని జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల బృందం ప్రశంసించింది.
- ఆదాయం ట్రిపుల్ కావడం భేష్
- మా రాష్ట్రంలోనూ అమలు చేస్తాం
- సీఎస్‌తో భేటీలో జార్ఖండ్ వాణిజ్య పన్నులశాఖ అధికారుల వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉన్నదని జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల బృందం ప్రశంసించింది. ఆ శాఖ ఆదాయం ఎనిమిదేండ్లలోనే ట్రిపుల్ కావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. తెలంగాణలోని విధానాలు తమకెంతో ఉపయోగపడతాయని, తమ రాష్ట్రంలోనూ ఇటువంటి విధానాలు అమలు చేస్తామని బృందం వెల్లడించింది.
గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో జార్ఖండ్ రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సీనియర్ అధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను సీఎస్ సోమేశ్‌కుమార్ జార్ఖండ్ అధికారుల బృందానికి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే వాణిజ్య పన్నుల శాఖ కూడా ఉన్నదని, ఆయన మార్గదర్శనంలో పన్నుల పరిపాలనలో అనేక మార్పు లు చేశామని చెప్పారు. ఫలితంగా.. ఆ శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం 2014లో రూ.23 వేల కోట్లు ఉంటే.. నిరుడు సుమారుగా 65 వేల కోట్లకు చేరిందని, దాదాపు మూడు రెట్లు పెరిగిందని తెలిపారు.
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరు గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉన్నదని జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయికిశోర్, కాశీ, జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ఆరాధనా పట్నాయక్, కమిషనర్ సంతోష్‌కుమార్ వత్సతోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

