హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాకు ప్రభుత్వ ప్రధాన శాఖలు దూరంగా ఉంటున్నాయి. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని కీలక విభాగాలు హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎక్స్, ఫేస్బుక్ వైపు కన్నెతి చూడ టం లేదు. లింకు రోడ్లు, సర్వీస్ రోడ్లు, ప్లానింగ్ విభాగంలో తలెత్తే సమస్యలు, ఓపెన్ ప్లాట్లు, లే అవుట్లు, ఓఆర్ఆర్పై వానాదారుల సమస్యలపై ప్రజలు ఎక్స్, ఫేస్బుక్లో సమస్యలను ప్రస్తావిస్తుంటారు.
ఈ విధానమంతా గత ప్రభుత్వ హయాంలో అందుబాటులో ఉండేది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమాల వినియోగాన్ని ప్రోత్సహించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత క్రమక్రమంగా ఎక్స్, ఫేస్బుక్ వినియోగం తగ్గిపోతున్నది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ తప్పిదాలు బయటపడుతాయన్న భయంతోనే వీటి వినియోగానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది.