హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో గురువారం దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభ జరుగుతుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సభకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
వికలాంగుల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సక్షేమ ఫలాలపై ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారని తెలిపారు.