డ్రగ్స్ నివారణకు వ్యూహాత్మక ప్రణాళిక
రాష్ట్రంలో డ్రగ్స్ నివారణే ధ్యేయమని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- పబ్‌లు, బార్లు, విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా
- టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డ్రగ్స్ నివారణే ధ్యేయమని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదకద్రవ్యాలకు హాట్‌స్పాట్‌గా ఉన్న పబ్‌లపై నిరంతరం దాడులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆర్టిస్ట్రీ, నోవాటెల్హెచ్ఐసీసీ, కేవ్ పబ్‌లలో టీన్యాబ్ సిబ్బంది, స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేయించి డ్రగ్స్ విక్రయిస్తున్న, వినియోగిస్తున్న పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా ప్రముఖ సెలబ్రెటీలతో అవగాహన ప్రచారాలను ప్రారంభించినట్టు వెల్లడించారు. సింబియాసిస్, గురునానక్, క్యులినరీ, చైతన్యభారతి, ఐఐఐటీ బాసర, జేఎన్టీయూ జోగిపేట, ఎన్ఐటీ తిరుచ్చి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో డ్రగ్స్‌తో పట్టుబడిన విద్యార్థులు, వైద్యులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. టీన్యాబ్ చర్యలతో డ్రగ్ పెడ్లర్స్‌లో భయం పుట్టిందని, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని సందీప్‌శాండిల్య హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

