హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ కోర్సులో గ్రేస్ మారులను తొలగిస్తూ నిరుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రవేశపెట్టిన నిబంధనలు చట్టబద్ధమైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రేస్ మారులు పొందడం విద్యార్థుల హకేమీ కాదని, కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాకే పరీక్ష నిర్వహించినందున పాత నిబంధనల ప్రకారం గ్రేస్ మారులు కలపాలని ఆదేశాలు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఎంసీఐ కొత్త నిబంధనలను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన 6 పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరిం చిం ది. అయితే ప్రత్యేక పరిస్థితులను పరి గణనలోకి తీసుకుని పిటిషనర్లకు గ్రేస్ మారుల అంశాన్ని ప్రతివాదులు పరిశీలించవచ్చని హైకో ర్టు పేర్కొంటూ విద్యార్థుల పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.