Congress Party | వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు కేఆర్ నాగరాజును అడ్డుకున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా గ్రామానికి ఎలా వచ్చారంటూ కేఆర్ నాగరాజు కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జక్కి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైకిళ్లతో దాడిచేశారు.`నాగరాజు గో బ్యాక్` అంటూ నినాదాలు చేశారు.
వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాగరాజు, నమిండ్ల శ్రీనివాస్ వర్గాలుగా చీలిపోయారు. తాజా ఘటనతో నల్లబెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు కాన్వాయ్‌పై దాడి చేసిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత నమిండ్ల శ్రీనివాస్ అనుచరులపై నాగరాజు వర్గీయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.