గోపాల్పేట, ఫిబ్రవరి 22 : వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు వివాదంగా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముందే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గీయుల మధ్య మరోమారు వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల వారు గొడవకు దిగడంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. బుద్ధారం గండి వద్ద పొల్కెపహాడ్ శివారులో మార్కెట్ యార్డు శంకుస్థాపన కోసం మంత్రి తుమ్మల, ఎంపీ మల్లు రవి శనివారం రాగా.. వారి ముందే అధికార పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. మేఘారెడ్డి జిందాబాద్.. చిన్నారెడ్డి జిందాబాద్ అంటూ రెండు వర్గాల వారు నినాదాలు చేశారు. దీంతో చిన్నారెడ్డితో పాటు ఆయన వర్గీయులు మంత్రి వెనుక శంకుస్థాపన స్థలం వద్దకు వచ్చి మార్కెట్‌ను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.