దేవరుప్పుల, జూలై 4 : అస్థిత్వం కోసం పోరాడి అసువులు బాసిన దొడ్డి కొమురయ్య నేలపై ఆయన వర్ధంతి రోజే సమైక్యవాది, మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పాలకులు తెలంగాణ లోకానికి ఏం సంకేతాలు ఇస్తున్నారని దొడ్డి కొమురయ్య వారసుడు కడవెండికి చెందిన దొడ్డి చంద్రం ఎక్స్ వేదికగా శుక్రవా రం ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో దొడ్డి కొమురయ్య విగ్రహం పెడతామని ఏడాదైందని.. ఇంకెప్పుడు పెడతారని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.