హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఏ ఇండియా) సంకల్పించిందని నేషనల్ వరింగ్ ప్రెసిడెంట్ కృష్ణభరత్ తెలిపారు. పరీక్ష సమయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైన విద్యార్థులకు ఏపీఏ ఇండియా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 105 మంది సైకాలజిస్టులు ఉచితంగా టెలీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారని వివరించారు.
విద్యార్థులు ఆ నంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ తీసుకోవచ్చని తెలిపారు. అవసరాన్ని బట్టి టెలీకౌన్సెలింగ్ అందించే సైకాలజిస్టుల సంఖ్య కూడా పెంచనున్నట్టు వివరించారు. టెలీకౌన్సెలింగ్లో ఇబ్బందులు ఎదురైతే 8008553069, 9963338639, 8686444200 నంబర్లకు తెలియజేయాలని కోరారు.