Career Guidance | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకొంటున్నారు. స్కూల్ దశ పూర్తిచేసిన తర్వాత ఏం చేయాలి.. ఏం చదువాలన్నది ప్రతి విద్యార్థికి ప్రశ్నార్థకమే. ఎస్సెస్సీ తర్వాత ఏం చరవాలి. ఏ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి.
ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి. ఎలాంటి కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది అన్నది ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే ప్రధాన సమస్య. ముఖ్యంగా సర్కారు బడుల్లో చదివేవారు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇలాంటి సమస్యలతో సతమతమవుతారు. ఇలాంటి విద్యార్థుల సమస్యలను, సందేహాలను తీర్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
‘తెలంగాణ కెరీర్ గైడెన్స్’ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు 1800-425-2428 నంబర్‌ను సంప్రదిస్తే ఉచితంగా సేవలు పొందవచ్చు. ఈ హెల్ప్లైన్నును 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకొంటున్న విద్యార్థుల కొరకు రూపొందించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ సమాచారం పూర్తి ఉచితం