ఆర్టిఫిషియల్ స్వీట్నర్లతో డయాబెటిస్!
అధిక బరువు తగ్గించుకొనేందుకు, బరువు పెరుగకుండా ఉండేందుకు చాలామంది కేలరీలు తక్కువగా ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లను వాడుతున్నారు.
- జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అధిక బరువు తగ్గించుకొనేందుకు, బరువు పెరుగకుండా ఉండేందుకు చాలామంది కేలరీలు తక్కువగా ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లను వాడుతున్నారు. మెట్రో నగరాల్లో నివసించే ప్రజలు వీటిని ఎక్కువగా తీసుకొంటున్నారు. అయితే, ఆర్టిఫిషియల్ స్వీట్నర్లతో టైప్ 2 డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది. అలాగే, వీటిని క్రమం తప్పకుండా వాడుతున్నవారిలో గుండె సంబంధ వ్యాధులతోపాటు, హైబీపీ, కొలెస్ట్రాల్, హర్మోన్ల అసమతుల్యతలాంటి సమస్యలు కనిపిస్తున్నట్టు పరిశోధకులు తేల్చారు.
బేకరీ, రెస్టారెంట్లలో తినే ఆహారంతోపాటు కూల్‌డ్రింక్స్ ద్వారా కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు శరీరంలోకి చేరుతున్నాయని గుర్తించారు. శాకరీన్, సైక్లామేట్, అస్పార్టేమ్, ఎసిసల్ఫేమ్ కే, సుక్రలోజ్లాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని కనుగొన్నారు. 27 శాతం మంది శాకరీన్, 25 శాతం సుక్రలోజ్, 23 శాతం అస్పర్టేమ్తో చేసిన ఆహారపదార్థాలు, పానీయాలను తీసుకొంటున్నట్టు తేల్చారు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్లను తీసుకునేవారిలో యువత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని వెంటనే మానేయకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

