Dhoopa Deepa Naivedyam | ధూపదీప నైవేద్యం అలవెన్స్‌లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ
Dhoopa Deepa Naivedyam | ధూపదీప నైవేద్యం అలవెన్స్‌లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Dhoopa Deepa Naivedyam | ధూపదీప నైవేద్యం అలవెన్స్‌లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రూ. 10వేలలో అర్చకుల గౌరవ వేతనం కింద రూ.6వేలు, ఆలయంలో పూజలు, ఇతర నిర్వహణకు రూ.4వేలు కేటాయించింది.
ఆలయాల్లో నిరంతరం పూజలు, ఇతర కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప, దీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత అర్చకులకు నెలకు రూ. 2500 వేతనంగా నిర్ణయించింది. కానీ, ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2015 జూన్ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అటు ఆలయాలకు.. ఇటు అర్చకులకు ఎంతో మేలు చేకూరింది. ఇప్పుడు పెరిగిన ఖర్చులతో ఇది కూడా సరిపోదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే అలవెన్స్‌లను రూ.10వేలకు పెంచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

