పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ ఏజెన్సీ కింద ప్రభుత్వ దవాఖానలో 28 మంది శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. జీతాలు అడిగితే విధుల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్ జీపీకి తాళం వేసి నిరసన తెలిపిన ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాభివృద్ధి కోసం రూ.30 లక్షల వరకు వ్యక్తిగతంగా ఖర్చు చేశానని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, అందుకు విసుగుచెంది పంచాయతీ కార్యాలయానికి తాళం వేశానని వాపోయారు. ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో శ్రీధర్‌గౌడ్ జీపీ కి చేరుకొని విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం తిరుపతిరెడ్డి అధికారులకు వినతి పత్రం అందజేశారు.