గోవిందరావుపేట, ఏప్రిల్ 9 : వడగండ్ల వానతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు కింది రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం వారు గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టపరిహారం కింద ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు దెబ్బతిని నష్టపోయిన వారికి రూ.5 లక్షలు అందించాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.