Dharani | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ సేవలను నాలుగు రోజలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. డాటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే పని సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది.
ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను టెర్రాసిస్ సంస్థ నుంచి ఎన్ఐసీకి అప్పగించాలని అక్టోబర్‌లో నిర్ణయించింది. నవంబర్ నాటికే టెర్రాసిస్ సంస్థతో ఒప్పందం గడువు ముగిసినా మరో నెలరోజులు పొడిగించారు. డిసెంబర్ 1న ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించనున్నట్టు అక్టోబర్‌లో రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు బదిలీ జరుగుతున్నదని, అందుకే నాలుగు రోజలపాటు పోర్టల్ సేవలు నిలిపివేస్తున్నారని చెప్తున్నారు.