సేఫ్ సిటీ’ ప్రాజెక్ట్‌పై డీజీపీ సమీక్ష
రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు స్టేటస్‌పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెలికాన్ సిగ్నల్స్ తదితర ఏర్పాట్ల పనితీరు గురించి అధికారులతో చర్చించారు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు స్టేటస్‌పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెలికాన్ సిగ్నల్స్ తదితర ఏర్పాట్ల పనితీరు గురించి అధికారులతో చర్చించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(సీడీఈడబ్ల్యూ) సెంటర్లలో అదనంగా మరో మూడింటిని మంజూరు చేయాలని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలోని చౌటుప్పల్, భువనగిరి, సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి తరఫున డీసీపీ డీ కవిత ప్రాజెక్ట్ పరిస్థితిని వివరించారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖా గోయల్, శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేశ్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు అవినాశ్ మహంతి, సుధీర్‌బాబు, డీసీపీలు ఉషా విశ్వనాథ్, కే సృజన, డీ సాయి శ్రీ, జీహెచ్ఎంసీ డీఈ మమత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి అఖిలేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

