హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతకాలు అందుకున్న పోలీసు అధికారులు, హోంగార్డులను డీజీపీ జితేందర్ శనివారం తన కార్యాలయంలో అభినందించారు. రాష్ట్రపతి పతకం అదుకున్నవారిలో హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, ఐఎస్‌డబ్ల్యూ ఇంటెలిజెన్స్ ఎస్పీ మాణిక్‌రాజ్, మెరిటోరియస్ సర్వీస్ పతకం అందుకున్నవారిలో ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, శంషాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జోన్ అదనపు డీసీపీ మొహమ్మద్ ఫజ్లూర్ రెహమాన్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ ముత్యంరెడ్డి, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ కేవీ రమణ, డీజీపీ ఆఫీస్ డీఎస్పీ వేణుగోపాల్, మెట్పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి, 1వ బెటాలియన్ ఏఎస్ఐ ఠాకూర్, 8వ బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ పీటర్ జోసెఫ్ బహదూర్, ఏఆర్ఎస్ఐ సీఐ సెల్ మొయినుల్లా ఖాన్, ఐఎస్‌డబ్ల్యూ హెడ్‌కానిస్టేబుల్ వీ పథ్య నాయక్, గ్రేహౌండ్స్ హెడ్‌కానిస్టేబుల్ ఎండీ అయూబ్ ఖాన్ ఉన్నారు. వీరితో పాటు ఎంఎస్ఎం మెడల్ అందుకోనున్న హోంగార్డులు మంత్రి ఈశ్వరయ్య, యాదగిరి, లక్ష్మణ్, ఐలయ్యలను డీజీపీ జితేందర్ అభినందించారు.