DGP Anjani Kumar | హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ విభాగంగా గ్రేహాండ్స్ను తీర్చిదిద్దిన ఎంఎస్ భాటి అంత్యక్రియలకు డీజీపీ అంజనీ కుమార్‌తో సహా పలువురు సీనియర్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు మూడు దశాబ్దాలుగా గ్రేహాండ్స్ వ్యవస్థాపక కమాండెంట్‌గా విశేష సేవలందిందించిన పద్మశ్రీ భాటి మంగళవారం దివంగతులయ్యారు. నేడు ఉదయం మహాప్రస్థానంలో జరిగిన వారి అంత్యక్రియలకు డీజీపీ అంజనీ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సావంగ్తోపాటు పలువురు అధికారులు హాజరై నివాళులు అర్పించారు.