హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రికార్డుస్థాయికి చేరుకున్నది. గతంలో ఎన్న డూ లేనివిధంగా ఈ ఏడాది మే నెల లో భక్తులు అత్యధికంగా తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. మే 27వ తేదీ వరకు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 2024 మేలో 10,65,729 మంది, 2025 మేలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు అధికారులు వివరించారు. మే 18 నుంచి 23 వరకు వరుసగా ఆరు రోజులపాటు ప్రతిరోజూ 50 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. మే 23న ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం గమనార్హం.
భక్తులు వేచిచూసే సమయం తగ్గించేందుకు, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేందుకు టీటీడీ విస్తృ త ఏర్పాట్లు చేసింది. ప్రధాన కల్యాణకట్టతోపాటు పీఏసీ-1, పీఏ సీ-2, పీఏసీ-3, పీఏసీ 5, జీఎన్సీ, హెచ్వీసీ, సప్తగిరి, నందకం, కౌస్తు భం, శ్రీవేంకటేశ్వర, శ్రీపద్మావతి తదితర విశ్రాంతి గృహాల సమీపాల్లో 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.