వేములవాడ, నవంబర్ 17: వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారి నిత్య కల్యాణాల టికెట్ల కోసం భకులు అవస్థలు పడుతున్నారు. ఆలయ విస్తరణలో భాగంగా కళాభవన్‌ను కూల్చివేయగా కల్యాణాలను పార్వతీపురంలోని నిత్యాన్నదాన సత్రం పైభాగంలో నిర్వహిస్తున్నారు. స్థలం తకువగా ఉండటంతో ఇకడ 80 టికెట్ల వరకే జారీ చేస్తున్నారు. మంచి రోజులు కావడం.. వివాది శుభకార్యాలు ఎకువగా జరుగుతుండటంతో స్వామివారి కల్యాణం మొకుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కల్యాణ మొకు చెల్లించుకునేందుకు భక్తులకు పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రస్తుతం స్వామివారి నిత్య కల్యాణం కోసం భక్తులు నానా తంటాలు పడుతున్నారు. చలిలో తాము టికెట్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని, అసలు టికెట్లు దొరకడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.