యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి కార్తిక మాసం చివరి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ మాడవీధులు,క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాల వద్ద భక్తులు క్యూ కట్టారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజలు వైభవంగా జరిగాయి. 1,578 మంది దంపతులు వ్రత పూజలో పాల్గొన్నారు. దాదాపు 45 వేల మంది భక్తులు
స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.54,85,058 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
– యాదాద్రి