హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఏపీలోని శ్రీకాళహస్తిలో కొలువైన జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారికి భక్తులు భూరి విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన రవి, గాయత్రి దంపతులు ముత్యాల ఆభరణాలను కానుకగా అమ్మవారికి పంపారు. అమెరికాలో ఉన్న దంపతులు వారి కుమార్తె పేరిట అందించిన ఈ ఆభరణాల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. ముత్యాలు పొదిగిన చీర, పాదుకలు హస్తాలు, నాగ పడగ సహిత వడ్డాణం, కిరీటం తదితరాలు ఈ ఆభరణాల్లో ఉన్నాయి. కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1.51 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.50 వేలను విరాళంగా విజయవాడకు చెందిన భక్తుడు షణ్ముఖ అందజేశారు.