హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
మూడేండ్ల క్రితం ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు.
- టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : మూడేండ్ల క్రితం ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ నైతిక బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంగళవారం ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను కాంగ్రెస్ సరార్ వంచించిందని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి నిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 17న వేలాదిగా సామూహిక సెలవులు పెట్టి నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

