ప్రసవ వేదనలో వినిపించే పాట
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఈథా’. శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటించింది. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఈథా’. శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటించింది. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమాలోని తొలి గీతం ‘జీ జీ రే జీ’ని విడుదల చేశారు. ఈ పాట ద్వారా విఠాబాయి జీవితంలో జరిగిన ఓ వాస్తవ సంఘటనను చూపించారు.
తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న విఠాబాయికి ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే పురిటి నొప్పులు మొదలవుతాయి. వెంటనే వేదిక వెనక్కి వెళ్లి.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆ తర్వాత తన ప్రదర్శనను కొనసాగిస్తుంది. ప్రసవ వేదనలో సైతం పాటను వదిలిపెట్టని ఈ అసాధారణ ఘట్టాన్ని పాటలో హృద్యంగా తెరకెక్కించారు. ఈ పాటలో శ్రద్ధాకపూర్ సంప్రదాయ నౌవారీ చీరలో లావణి నృత్యం చేస్తూ కనిపించారు. అజయ్- అతుల్ సంగీతాన్నందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట అందరిని ఆకట్టుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

