హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): పీఆర్టీయూ రాష్ట్ర కోశాధికారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పులి దేవేందర్ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భం గా రాష్ట్ర కమిటీ నుంచి నియామక పత్రం అందుకొన్న దేవేందర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు, 317 జీవో, పండి ట్, పీఈటీ, కేజీబీవీ, మాడ ల్ సూళ్లలో సమస్యలను పరిషారానికి ప్రభుత్వం తో చర్చిస్తానని చెప్పారు. సంఘ పటిష్టత, విస్తరణకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ భిక్షంగౌడ్, గౌరవా ధ్యక్షుడు వెంకట్రెడ్డి, రాష్ట్ర కమి టీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.