హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): స్లెండర్ లోరిస్ (దేవాంగ పిల్లి) జాతి వన్యప్రాణులను సీసీఎంబీ పరిశోధకులు మలబార్, మైసూర్ అటవీ ప్రాంతా ల్లో కనుగొన్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతుల్లో ఉన్న ఈ దేవాంగ పిల్లి జన్యుక్రమాన్ని నమోదు చేశారు. పశ్చిమ కనుమల్లో వివిధ జంతు జాతులు, వృక్ష జాతులపై పరిశోధన చేస్తున్న సీసీఎంబీ పరిశోధకులు తాజాగా ఈ దేవాంగ పిల్లిని కనుగొన్నారు. శ్రీలంకలో అరుదుగా కనిపించే ఈ పిల్లులు కాలక్రమంలో ఇండియాకు విస్తరించాయి. ఇప్పటివరకు సేకరించిన జన్యు సమాచారం ప్రకారం రెండు విభిన్న జాతులు ఉన్నాయని వీటి ఉనికి మిలియన్ ఏండ్ల కింద నుంచే ఉన్నదని తేల్చారు.