యాదాద్రి భువనగిరి : విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతూ మార్గమధ్యంలో బీబీనగర్‌లోని ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను( ,Bibinagar residential school )ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మోటిక్ ఛార్జీల వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందితేనే వారు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారన్నారు. ఎదిగే సమయంలో కావాల్సిన పోషకాలు అందిస్తేనే మెదడు చురుకుగా పనిచేసి టీచర్లు బోధించే పాటాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటారని వివరించారు. క్యాబినెట్ సహచరులు మొదలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తరచూ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అందుతున్న సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.