హైదరాబాద్, జూన్19 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలోని సిబ్బందిని ఒకేసారి డిప్యూటేషన్లపై పంపారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తాజాగా ఆదేశాలను జారీచేశారు. బాలికల గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న 57 మంది పురుష సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేరొక గురుకులానికి పంపించారు.
అదేవిధంగా సొసైటీ పరిధిలోని ఇంటర్ గురుకుల కాలేజీల్లో మారిన గ్రూపులకు అనుగుణంగా 89 మంది జూనియర్ లెక్చరర్లను డిప్యూటేషన్లపై నియమించారు. సొసైటీ తీసుకున్న ఆయా నిర్ణయాలపై గురుకుల సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
హైద రాబాద్, జూన్19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్మెంట్ అమలు కోసం రాష్ట్రప్రభుత్వం, టోనీబ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. గురువారం డిల్లీలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఇద్దరి మధ్య గంట పాటు సంభాషణ జరిగినట్టు తెలిపింది. తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమ వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ప్రధాని బ్లెయిర్‌కు వివరించారని పేర్కొన్నది.