హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఉద్యోగాల్లో అక్రమాలపై విద్యాశాఖ స్పందించింది. ఈ అంశంపై ప్రా థమిక విచారణకు ఆదేశించింది. 2002 డీఎస్సీ బాధితులకు టీచర్ ఉద్యోగాలిచ్చేందుకు విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఇదే అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘ఐదు లక్షలిస్తేనే టీచర్ ఉద్యోగం’ శీర్షికతో ఆదివారం కథనం ప్రచురితమై ంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు.