బంజారాహిల్స్, జూన్ 15: హైదరాబా ద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని లోటస్‌పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం బయట ఫుట్‌పాత్‌పై నిర్మించిన సెక్యూరిటీ గార్డుల గదులను జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం కూల్చివేశారు. లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు, భద్రతా సిబ్బంది కోసం ఇంటిబయట గతంలో తాత్కాలిక గదులు నిర్మించారు. ఇటీవల ఎన్నికల్లో జగన్ ఓటమి పాలవడంతో ఇక్కడ భద్రతను తొలగించారు. జగన్ ఇంటిముందు ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మాణాలున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేశారంటూ జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సంపత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఈ కూల్చివేతలు చేపట్టారు.