హిమాయత్‌నగర్, అక్టోబర్ 29: బెటాలియన్ పోలీసుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన 39మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబసభ్యులు చేస్తున్న పోరాటానికి పౌరహక్కుల సంఘం మద్దతునిస్తుందని ప్రకటించారు. ఏకీకృత పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్యులు లింగన్న, విష్ణువర్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు చెప్పి పరిష్కరించుకోవాలని ఏడీజీ స్వాతి లక్రా సూచించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 2న ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆందోళనలు చేపట్టేందుకు హోంగార్డులు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో.. వారి సమస్యలను ‘నమస్తే తెలంగాణ’ ఏడీజీతో ప్రస్తావించింది. ఆమె మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణలో హోంగార్డులకు అధిక వేతనం ఇస్తున్నట్టు చెప్పారు.