ఊటూర్, జూలై 23 : నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు మెరుగైన పరిహారం అందించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బాపురంలో భూములు కోల్పోతున్న పలువురు రైతులు స్థానిక అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ చేశారు. కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం బలవంతంగా భూసేకరణ చేపట్టిన సర్కారు పరిహారం చెల్లింపులో రైతులను భయానికి గురిచేయడం సరికాదని అన్నారు. ఎకరాకు రూ.14 లక్షలు చెల్లించడం కంటితుడుపు చర్య మాత్రమే అవుతుందని, ఈ నిర్ణయం తగదని అన్నారు. మెరుగైన పరిహారం ఇచ్చే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు.